మేడారంలో మంత్రి తలసాని తులాభారం

అమ్మవార్లకు మొక్కులు చెల్లింపు

Talasani srinivas yadav
Talasani srinivas yadav

మేడారం: తెలంగాణ మంత్రులు అల్లోల్ల ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ మేడారం జాతరలో సారలమ్మను దర్శించుకున్నారు. మేడారం జాతరకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు. వన దేవతలను కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తులాభారం వేసుకొని మొక్కు చెల్లించారు. కాగా ఇప్పటికే మేడారం పరిసర ప్రాంతాలు జనసంద్రంగా మారాయి. మరోవైపు సమ్మక్క కుంకుమ భరిణె గద్దె ప్రాంగణంకు రావాల్సి ఉంది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/