29న కొండపోచమ్మసాగర్ ప్రారంభించనున్న సిఎం

kcr
kcr

హైదరాబాద్‌: సిఎం కెసిఆర్‌ ఈనెల 29న (శుక్రవారం) అత్యంత ప్రతిష్టాత్మకమైన కొండ పోచమ్మ సాగర్‌ను ప్రారంభించబోతున్నారు. ఈ అద్భుత ఘట్టానికి సిద్ధిపేట వేదిక కాబోతోంది. నిజానికి ఈ ప్రాజెక్టు ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉంది. రకరకాల కారణాల వల్ల అది వాయిదా పడుతూ వస్తోంది. . ఇప్పుడు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఈనెల 29న ఉ.11:30 గంటలకు సీఎం కెసిఆర్ స్వయంగా జలాశయంలోకి నీరు విడుదల చేస్తారని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఈ సందర్భంగా కొండ పోచమ్మ ఆలయంలో చిన్నజీయర్‌ స్వామితో కలిసి సిఎం కెసిఆర్‌ ఓ హోమం కూడా జరుపుతారని హరీశ్ తెలిపారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/