సింగరేణి ఎన్నికలు వాయిదాః తెలంగాణ హైకోర్టు

telangana-singareni-elections-2023-postponed

హైదరాబాద్‌ః సింగరేణి ఎన్నికలపై తెలంగాణ రాష్ట్ర హై కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. సింగరేణి ఎన్నికలు వాయిదా వేసింది. డిసెంబర్ 27న సింగరేణి ఎన్నికలు వాయిదా వేస్తూ హై కోర్టు తీర్పు ఇచ్చింది. నవంబర్ 30వ తేదీ లోపు ఓటర్ లిస్ట్ రెడీ చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఇది ఇలా ఉండగా, ఈ నెల 28 న సింగరేణి లో ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధం అయింది కేంద్ర కార్మిక శాఖ. అయితే.. ఈ ఎన్నికల పై హై కోర్టు డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేసింది సింగరేణి యాజమాన్యం. అసెంబ్లీ ఎన్నికల కారణంగా సింగరేణి ఎన్నికలు వాయిదా వేయాలని కోరుతోంది సింగరేణి యాజమాన్యం. ఈ తరుణంలోనే.. సింగరేణి ఎన్నికలపై తెలంగాణ రాష్ట్ర హై కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. సింగరేణి ఎన్నికలు వాయిదా వేసింది.