వివేకా హత్య కేసు : ఏ1 ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు

వివేకా హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ1 గా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ ను రద్దు చేసింది తెలంగాణ హైకోర్టు. మే 5వ తేదీ లోపల సీబీఐ కోర్టులో లొంగిపోవాలని గంగిరెడ్డిని హైకోర్టు ఆదేశించింది. ఈ లోపు లొంగిపోకపోతే అరెస్ట్ చేయొచ్చని ఆదేశించింది.

గంగిరెడ్డి బయట ఉంటూ సాక్షులను బెదిరిస్తున్నారని హైకోర్టుకు సీబీఐ తెలిపింది. వివేకా హత్య కేసు కీలక దశలో ఉందని… గంగిరెడ్డి బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తారని కోర్ట్ కు తెలిపింది. గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని సిబిఐ హైకోర్టు ను కోరింది. సీబీఐ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు గంగిరెడ్డి బెయిల్ రద్దు చేసింది. 5వ తేదీ లోపల సీబీఐ కోర్టు ఎదుట గంగిరెడ్డి లొంగిపోవాలని ఆదేశాలు జారీచేసింది.