ఉద్యమాలను సీఎం కెసిఆర్ అణచివేస్తున్నారు
సీఏఏ విషయంలో కెసిఆర్ రాజకీయ నాటాకాలు ఆడుతున్నారు

హైదరాబాద్: సీఏఏ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ రాజకీయ నాటకాలు ఆడుతున్నారని రాష్ట్ర పీసీపీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. 71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గాంధీభవన్లో జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ ప్రజలంతా రాజ్యాంగాన్ని గౌరవించాలని పిలుపు ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ , కేసీఆర్ ప్రభుత్వాలు ప్రజలకు స్వేచ్ఛనివ్వడంలేదని విమర్శించారు. కశ్మీర్ ప్రజలను మోదీ ప్రభుత్వం అణచివేస్తోందని ఉత్తమ్ విమర్శించారు. తెలంగాణలో ఉద్యమాలను కెసిఆర్ ఉక్కుపాదంతో అణచివేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్ష నేతలను బెదిరించి పార్టీలో చేర్చుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ను దెబ్బతీయాలని టిఆర్ఎస్ , బిజెపి, ఎంఐఎం పార్టీలు లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నాయని ఉత్తమ్ తీవ్రస్థాయిలో విమర్శించారు.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/