ఇబ్రహీంపట్నం ఘటనపై సీరియస్ అయినా గవర్నర్

ఇబ్రహీంపట్నం ఘటనపై గవర్నర్ తమిళసై స్పందించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని సూచించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ వికటించిన నలుగురు మహిళలు మృతి చెందిన సంగతి తెలిసిందే. మరికొంతమంది నిమ్స్ హాస్పటల్ లో చికిత్స తీసుకుంటున్నారు. ఈ ఘటన ఫై ఇప్పటికే పలు రాజకీయ పార్టీల నేతలు ప్రభుత్వం ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తూ…బాధిత కుటుంబాలను ఆదుకోవాలని హెచ్చరించారు.

కాగా ఈరోజు గవర్నర్ తమిళిసై సౌందరాజన్ ఈ ఘటన ఫై స్పందించారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు జరగడం దారుణమని మండిపడ్డారు. శస్త్ర చికిత్స అనంతరం చనిపోయిన బాధితు కుటుంబాలకు అండగా ఉండాలని గవర్నర్ ప్రభుత్వానికి సూచించారు. చికిత్స పొందుతున్న మహిళలకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఆపరేషన్ వికటించడంతో ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ పొందుతున్న మహిళల్ని త్వరలోనే పరామర్శించనున్నట్లు తమిళిసై ప్రకటించారు.

ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రిలో ఈ నెల 25న కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు. అయితే శస్త్ర చికిత్స విఫలం కావడంతో వారిలో కొందరి పరిస్థితి సీరియస్‌గా మారింది. వారిలో నలుగురు మహిళలు వివిధ హాస్పిటళ్లలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ప్రస్తుతం 17 మంది బాధిత మహిళలకు నిమ్స్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ కొనసాగుతోంది.