వైస్సార్సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు చేదు అనుభవం

YCP MP Gorantla Madhav

వైస్సార్సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఈ మధ్య తరుచు వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఇప్పటికే పలు వివాదాస్పద ఘటనల్లో ఆయన పేరు మారుమోగిపోగా..తాజాగా మంగళవారం హిందూపురం లో చేదు అనుభవం ఎదురైంది. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా రాజకీయ నేతలంతా అంబేద్కర్ చిత్రపటానికి నివాళ్లు అర్పిస్తూ వస్తున్నారు.

ఈ క్రమంలో హిందూపురం మున్సిపల్ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి నివాళి అర్పించేందుకు గోరంట్ల మాధవ్ అక్కడకు వచ్చారు. అయితే కార్యక్రమానికి ఎమ్మెల్సీ రాకపోవడంతో విగ్రహావిష్కరణ కార్యక్రమం ఆగిపోయింది. దీంతో, గోరంట్ల మాధవ్ ను దళిత సంఘాల నేతలు నిలదీశారు. ఎమ్మెల్సీ రాకపోతే విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని వాయిదా వేస్తారా? అంటూ మండిపడ్డారు. అయితే వారిని నచ్చచెప్పేందుకు మాధవ్ ప్రయత్నించినా వారు వినలేదు. దీంతో, విగ్రహాన్ని ఆవిష్కరించకుండానే, పూలదండ వేసి ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు.