సిటీ బస్సులో ప్రయాణం చేసిన సీఎం స్టాలిన్

తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఏం చేసినా విభిన్నంగా ఉంటోంది. వినూత్న నిర్ణయాలతో వార్తల్లో నిలుస్తున్న వస్తున్న ఈయన ..తాజాగా సిటీ బస్సులో ప్రయాణం చేసి ప్రయాణికులకు షాక్ ఇచ్చారు. చెన్నైలోని టీ నగర్‌ నుంచి కన్నగి నగర్‌ వరకు ఆయన సిటీ బస్సు లో ప్రయాణించారు.

ముఖ్యమంత్రి బస్ లో ప్రయాణం చేయడం చూసి అంత ఆశ్చర్య పోయారు. స్టాలిన్‌ తో ఫోటోలు తీసుకునేందుకు ప్రయాణికులు పోటీ పడ్డారు. బస్సు లో సౌకర్యాలపై స్టాలిన్‌ ఆరా తీశారు. బస్సులు సమయానికి వస్తున్నాయా? ఏమైనా సమస్యలున్నాయా ? అని ఈ సందర్భంగా స్వయంగా ప్రయానికులను అడిగి తెలుసుకున్నారు.

ఇదిలా ఉంటె ‘సీఎన్‌ఓస్‌ ఒపీనియోమ్‌’ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో దేశంలో అత్యుత్తమ ముఖ్యమంత్రులుగా ఐదుగురు ఎంపికయ్యారు. వీరిలో మొదటి స్థానంలో స్టాలిన్‌ నిలిచారు. దేశంలో ప్రజాభిమానం మెండుగా కలిగిన అత్యుత్తమ ముఖ్యమంత్రిగా ఎంకే స్టాలిన్‌ మరోమారు ప్రథమస్థానం సంపాదించుకున్నారు. ఆ సంస్థ రాష్ట్రంలో నిర్వహించిన సర్వేలో 70 శాతం మంది స్టాలిన్‌ పరిపాలన భేషుగ్గా ఉందని కితాబు ఇవ్వడం విశేషం.