బిఆర్ఎస్ లో చేరుతున్న ఏపీ నేతలు..స్పందించిన కేఏ పాల్

ఆంధ్రులను బూతులు తిట్టిన కేసీఆర్ పార్టీలో చేరుతున్నారని పాల్ మండిపాటు

KA Paul
KA Paul

అమరావతి : భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) ఏపీలో అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. ఈ సాయంత్రం బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు, మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్, మాజీ ఐఆర్ఎస్ అధికారి పార్థసారథి తదితర ఏపీ నేతలు ఆ పార్టీలో చేరనున్నారు. ఈ నేపథ్యంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మాట్లాడుతూ .. బిఆర్ఎస్ లో చేరుతున్న ఏపీ నేతలపై మండిపడ్డారు.

ఆంధ్రులను బూతులు తిట్టిన కేసీఆర్ పక్కన చేరడం దారుణమని అన్నారు. కేసీఆర్ పార్టీలో కుక్కలు, నక్కలు, నీచుల మాదిరి చేరుతున్నారని దుయ్యబట్టారు. కోట్ల రూపాయలకు ఆశపడి ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు. రావెల కిశోర్ బాబు పెద్ద అవినీతిపరుడని అన్నారు. తోట చంద్రశేఖర్ ను కాపు సమాజం వెలివేయడం ఖాయమని చెప్పారు.

.