హీరో నిఖిల్ కు ఐకానిక్ గోల్డ్ అవార్డ్

కార్తికేయ 2 మూవీ తో పాన్ ఇండియా హిట్ అందుకున్న యంగ్ హీరో నిఖిల్..తాజాగా ఐకానిక్ గోల్డ్ అవార్డ్ అందుకున్నారు. కార్తికేయ చిత్రానికి గాను ఐకానిక్ గోల్డ్ అవార్డ్స్ 2023లో నిఖిల్ సిద్ధార్థ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. తాజాగా ఈ అవార్డును నిఖిల్​ అందుకున్నారు. అందుకు సంబంధించిన వీడియోను నిఖిల్​.. సోషల్​ మీడియాలో పంచుకున్నారు. బ్యాక్​గ్రౌండ్​లో ‘హే కేశవ.. హే మాధవ.. హే గోవిందా’ పాటను జోడించి పోస్ట్​ చేశారు. ఈ వీడియో చూసి అభిమానులు అభినందనలు తెలుపుతూ , తెగ షేర్ చేస్తున్నారు.

గత ఏడాది నిఖిల్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ కార్తికేయ-2. ఐదు భాషల్లో అద్భుతమైన విజయం సాధించింది. కేవలం రూ. 15 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 121 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాతో నిఖిల్ కి బాలీవుడ్ నుంచి కూడా మంచి గుర్తింపు వచ్చింది. యంగ్ డైరెక్టర్ చందు ముండేటి దర్శకత్వం వహించగా, అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. నిఖిల్ ప్రస్తుతం స్పై అనే యాక్షన్ థ్రిల్లర్ మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమా కూడా పాన్ ఇండియాను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కిస్తున్నారు. క్షణం, గూఢచారి, ఎవరు, హిట్-1,2 సినిమాలకు ఎడిటర్ గా, అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన గర్రి బిహెచ్ ఈ సినిమా కు డైరెక్టగా వ్యవహరిస్తున్నాడు. ఈ మూవీలో నిఖిల్ కి జోడిగా తమిళ హీరోయిన్ ఐశ్వర్య మీనన్ నటిస్తుంది. ఈడి ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై కె రాజశేఖర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.