బండి సంజయ్ కి తలసాని వార్నింగ్

హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రచారం మరికాసేపట్లో ముగియనుంది. ప్రచార చివరి రోజు కావడం తో అన్ని పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు. ఈ తరుణంలో తెరాస మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్..బిజెపి నేత బండి సంజయ్ ఫై నిప్పులు చెరిగారు.

హుజూరాబాద్ లోని TRS పార్టీ కార్యాలయంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. హుజూరాబాద్ నియోజక వర్గంలో బండి సంజయ్ కరోనా సమయంలో ఎప్పుడైనా పర్యటించావా ..? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చెప్తామని… ప్రజలకు మీరేం చేశారో చెప్పే ధైర్యం BJP నేతలకు ఉందా? అని ప్రశ్నించారు. గడిచిన 7 సంవత్సరాల కాలంలో జరిగిన అభివృద్ధి కండ్ల ముందు కనిపిస్తుందని… పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచడమే మీరు చేసిన అభివృద్ధి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటమి భయంతోనే బిజెపి నేతలు ప్రభ్యత్వం పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, కానీ ప్రజలు డిసైడ్ అయ్యారు…హుజూరాబాద్ లో శ్రీనివాస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.