వారి బ్యాటింగ్‌ అంటే నాకు భయమేస్తోంది!

షెఫాలీ ఎదురుదాడికి నా వద్ద సమాధానం లేదు

I-dont-wanna-bowl-for-Shefali-Varma-and-Smriti-Mandhana-during-Power-play
I-dont-wanna-bowl-for-Shefali-Varma-and-Smriti-Mandhana-during-Power-play

మెల్‌బోర్న్‌: మహిళల టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో భారత్‌- ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. మార్చి 8వ తేదీన మెల్‌బోర్న్‌లో ఇరు జట్లు ఫైనల్‌ మ్యాచ్‌ ఆడుతాయి. ఆసీస్‌ వరుసగా ఆరోసారి టీ20 ప్రపంచకప్‌లో ఫైనల్లో అడుగుపెట్టగా..భారత్‌ తొలిసారి ఈ మెగా టోర్నిలో ఫైనల్‌కు చేరింది. ఫైనల్‌ మ్యాచ్‌ సందర్భంగా ఆసీస్‌ ఫాస్ట్‌ బౌలర్‌ మెగాన్‌ స్కట్‌ మీడియా సమావేశంలో మాట్లాడుతూ భారత్‌తో ఆడటాన్ని అసహ్యించుకుంటున్నా అని పేర్కొన్నారు. భారత స్టార్‌ ఓపెనర్లు షెఫాలీ వర్మ, స్మృతి మంథానాలే అందుకు కారణం అని తెలిపారు. షెఫాలీ, మంథానాలకు బౌలింగ్‌ చేయాలంటే..భయమేస్తుంది. వారి బ్యాటింగ్‌ అంటే నాకు వణుకు పుట్టిస్తోంది. ముఖ్యంగా ఫెఫాలీ ఎదురుదాడికి నా వద్ద సమాధానం లేదు అని స్కట్‌ తెలిపారు. షెఫాలీ, మంథానాలు భారత జట్టుకు వెన్నుముక. ఇన్నింగ్స్‌ ఆరంభం నుండే ఇద్దరూ బలమైన షాట్లతో దాడి చేస్తున్నారని మెగాన్‌ స్కట్‌ పేర్కొన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/