భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీస్తున్నారు

ఎస్‌ బ్యాంక్‌ పరిణామాలపై రాహుల్ గాంధీ, చిదంబరం ఆందోళన

Rahul Gandhi
Rahul Gandhi

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఎస్‌ బ్యాంకుపై భారతీయ రిజర్వు బ్యాంకు ఆంక్షలు విధించిన నేపథ్యంలో స్పందించారు. ఇది ఎస్‌ బ్యాంక్‌ వైఫల్యం కాదని, ప్రధాన మంత్రి నరేంద్ర మోడి విధానాలే భారతీయ ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీస్తున్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు.
మరోవైపు ఈ అంశంపై కాంగ్రెస్ నేత చిదంబరం మాట్లాడుతూ.. బిజెపి ఆరేళ్లుగా అధికారంలో ఉందని, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో జరిగిన పరిణామాల వల్ల ఇప్పటికే బిజెపి పరిపాలన, ఆర్థిక సంస్థల నియంత్రణలో వైఫల్యాలు బయటపడ్డాయని ముందుముందు ఇంకా ఏం జరుగుతుందోనని ఆందోళన వ్యక్తం చేశారు. ‘పూర్తిగా ఆర్థిక వ్యవస్థ నియంత్రణ వైఫల్యం కనపడుతోంది. ఇది ఇక్కడితో ఆగుతుందా? లేక ఇటువంటి పరిణామాలు మరికొన్ని చోటు చేసుకుంటాయా? దీనిపై ప్రభుత్వం ఇప్పటికీ మౌనంగానే ఉంది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ డిపాజిటర్ల మాదిగానే ఎస్‌ బ్యాంకు ఖాతాదారులు కూడా ఆందోళనకు గురవుతున్నారు’ అని చిదంబరం చెప్పారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/