జ‌మ్మూలో మ‌రోసారి డ్రోన్ల క‌ల‌క‌లం

సాంబా జిల్లాలో క‌ల‌క‌లం రేపిన‌ మూడు డ్రోన్లు

శ్రీన‌గ‌ర్ : జ‌మ్మూక‌శ్మీర్‌లో డ్రోన్ల క‌ల‌క‌లం కొన‌సాగుతోంది. ఈ క్రమంలో సాంబా జిల్లాలో గ‌త‌ రాత్రి ఏకంగా మూడు ప్రాంతాల్లో డ్రోన్లు సంచ‌రించ‌డం గ‌మ‌నార్హం. తొలి డ్రోన్‌ను బారి బ్ర‌హ్మ ప్రాంతంలో, రెండో డ్రోనును చ‌లియారి వ‌ద్ద గుర్తించిన‌ట్లు అధికారులు తెలిపారు.

ఆ కాసేప‌టికే గ‌గ్వాల్ ప్రాంతంలో మూడో డ్రోనును గుర్తించిన‌ట్లు చెప్పారు. వాటిని గుర్తించిన వెంట‌నే కాల్పులు జ‌ర‌ప‌డంతో అవి తోక‌ముడిచాయి. డ్రోన్లు సంచ‌రించిన ప్రాంతాల్లో భ‌ద్ర‌తా బ‌ల‌గాలు త‌నిఖీలు చేశాయి. డ్రోన్ల ద్వారా ఆయుధాలు, డ్ర‌గ్స్ వంటివి జార‌విడిచారా? అన్న విష‌యంపై భ‌ద్ర‌తా బ‌ల‌గాలు అప్ర‌మత్త‌మ‌య్యాయి. డ్రోన్ల సంచారంతో సాంబా జిల్లాలో హై అల‌ర్ట్ ప్ర‌క‌టించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/