మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి ఆయనేనా..?

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సోదరుడు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కి , తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం తో..మునుగోడు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో బిజెపి నుండి ఆయన బరిలోకి దిగుతుండగా..కాంగ్రెస్ పార్టీ నుండి పాల్వాయి స్రవంతి పోటీ చేస్తుంది. ఇక టీఆరఎస్ నుండి ఎవరు బరిలో దిగుతారా అనేది గత కొద్దీ రోజులుగా చర్చ గా మారింది. అయితే టిఆర్ఎస్ నుండి మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి బరిలో దిగబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సీఎం కేసీఆర్ పార్టీ కేడర్‌కు కూసుకుంట్ల అభ్యర్దిగా సంకేతాలు పంపినట్లు తెలుస్తుంది. అలాగే మునుగోడు నియోజకవర్గంలో మండలాల వారీగా ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలు చేపట్టాలని టీఆర్ఎస్ ప్లాన్ చేసింది.

ఇక మునుగోడు ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి బిజెపి కి బుద్ధి చెప్పాలని టిఆర్ఎస్ చూస్తుంది. ఇప్పటికే మునుగోడు లో నేతలు పర్యటిస్తూ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం, రోడ్లు వెయ్యడం, రైతుల రుణ మాఫీలు చేయడం , డబుల్ బెడ్ రూమ్స్ కు శ్రీకారం చుట్టడం వంటివి చేస్తూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు. అధికారంలోకి వస్తే మునుగోడు నియోజకవర్గంలో మరింత అభివృద్ధి జరుగుతుందని హామీ ఇస్తున్నారు. మరోపక్క బిజెపి , కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు , ఆయా పార్టీల నేతలు వరుస పర్యటనలు , సమావేశాలు చేస్తూ హడావిడి చేస్తున్నారు. మొత్తం మీద మునుగోడు ఉప ఎన్నిక ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా కొనసాగుతుంది.