ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ ఫుట్‌బాల్‌ టోర్నీ

హైదరాబాద్‌ విజయం

Super League football tournament trophy
Super League football tournament trophy

Goa : ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ ఫుట్‌బాల్‌ టోర్నీలో ఆదివారం చెన్నైయిన్‌ ఎఫ్‌సితో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ ఎఫ్‌సి 2-0తో విజయం సాధించింది. ప్రథమార్ధంలో ఫ్రాన్‌ శాండజ, ద్వితీయార్ధంలో జోయల్‌ చైనీస్‌ గోల్స్‌ చేసి హైదరాబాద్‌ జట్టును గెలిపించారు. ఈ విజయంతో హైదరాబాద్‌ 15 మ్యాచ్‌లలో 22 పాయింట్లు సాధించి మూడో స్థానానికి చేరుకుంది.

కాగా చెన్నై 16 పాయింట్లతో ఆరో స్థానంలో కొనసాగుతోంది. మరో మ్యాచ్‌లో ఎటికె మోహన్‌ బగాన్‌ జట్టు 3-2 తేడాతో కేరళ బ్లాస్టర్స్‌పై గెలుపొందింది. సోమవారం ఒదిశా ఎఫ్‌సి, జంషెడ్‌పూర్‌ ఎఫ్‌సి జట్లు తలపడనున్నాయి.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/