బిగ్ బాస్ విన్నర్ సన్నీ కి భారీ షాక్..ప్రైజ్‌మనీలో భారీ కోత

అంత అనుకున్నట్లే బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ గా సన్నీ గెలిచినా సంగతి తెలిసిందే. మొదటి ఎపిసోడ్ నుంచి నెగిటివిటి ఎదుర్కొన్న సన్నీ ఆ తర్వాత తన గేమ్ స్టైల్‌ని మారుస్తూ టాస్క్‌ల్లో విజయం సాధించడమే కాకుండా ప్రేక్షకుల హృదయాలను కూడా గెలుచుకున్నాడు. ఓటింగ్‌లో అత్యధిక శాతం ఓట్లను దక్కించుకొని బిగ్‌బాస్ 5 టైటిల్‌ను గెలుచుకున్నాడు. దీంతో పాటు యాభై లక్షల ప్రైజ్ మనీ, ట్రోపీ, సువర్ణ భూమి వారి సువర్ణ కుటీర్ తరపు నుంచి పాతిక లక్షలు విలువ చేసే భూమి, ఒక టీవీఎస్ బైక్ ను గెలుచుకున్నారు.
అయితే, అతడికి మాత్రం రూ. 34.40 లక్షలు మాత్రమే చేతికి వచ్చిందని తెలుస్తుంది. దీనికి కారణం ఏదైనా షోలో 10 వేల కంటే ఎక్కువ గెలిస్తే 31.2% పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అంటే అతడికి దక్కిన రూ. 50 లక్షల్లో.. రూ. 15.60 లక్షలు ఆదాయపు పన్ను శాఖకు వెళ్లిపోతుంది. దీంతో సన్నీ ప్రైజ్‌మనీలో రూ. 34.40 మాత్రమే అందుకున్నాడు. దీంతో అతడు కోటి రూపాయలకు పైగా గెలిచినా ట్యాక్సుల వల్ల చాలా కోల్పోయాడనే టాక్ వినిపిస్తోంది.
ఖమ్మ జిల్లాకు చెందిన వీజే సన్నీ.. జర్నలిస్టుగా కెరీర్‌ను ఆరంభించాడు. ఆ తర్వాత వీడియో జాకీగా మారాడు. అనంతరం సీరియల్స్‌లో నటించి మంచి గుర్తింపును అందుకున్నాడు. ఇక, కొన్ని సినిమాల్లోనూ నటించాడు. ఇలా ఈ సీజన్ ద్వారా బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక, పెద్దగా ఫాలోయింగ్ లేకపోయినా సన్నీ ..కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు.