పుష్ప 3 డేస్ కలెక్షన్స్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయిక అంటే అభిమానులకు పెద్ద పండగే. గతంలో వీళ్లిద్దరూ కలిసి ‘ఆర్య’, ‘ఆర్య2’ వంటి ఫీల్ గుడ్ సినిమాలు చేశారు. ఇక, సుదీర్ఘ విరామం తర్వాత ఇప్పుడు ‘పుష్ప’ అనే చిత్రంతో శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చారు. పక్కా మాస్ కమర్షియల్ మూవీగా విడుదలైన ఈ సినిమాకు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా సూపర్ హిట్ టాక్‌తో పాటు కలెక్షన్లు కూడా రికార్డు స్థాయిలో దక్కుతున్నాయి. దీంతో బాక్సాఫీస్ షేక్ అయిపోతోంది. విభిన్న క‌థాంశంతో సుకుమార్ రూపొందించిన ఈ సినిమా మూడో రోజు (ఆదివారం) కూడా రికార్డులు బ‌ద్ద‌లు కొట్టిందని, 2021లో ఇండియాలో అత్య‌ధిక గ్రాస్ సాధించిన చిత్రంగా నిలిచింద‌ని పుష్ప టీమ్ తమ అధికారిక ట్విట్ట‌ర్ ఖాతాలో తెలిపింది.

మూడు రోజుల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా మొత్తం రూ.173 కోట్లు సాధించింద‌ని చిత్ర యూనిట్ తెలిపింది. క‌రోనా స‌మ‌యంలోనూ గ‌తంలోని రికార్డుల‌న్నింటినీ ‘పుష్ప’ బ‌‌ద్ద‌లు కొడుతూ దూసుకుపోతుండ‌డం గ‌మ‌నార్హం. నిన్న, మొన్న సెల‌వు దినాలు కావ‌డంతో పుష్ప‌ను చూడ‌డానికి ప్రేక్ష‌కులు భారీగా త‌ర‌లివ‌చ్చారు. నైజాంలో పుష్ప భారీ వసూళ్లను రాబడుతున్నది. రెండో రోజు 7.40 కోట్లు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం రెండు రోజులకే 18.84 కోట్లు రాబట్టింది. మూడో రోజున ఈ చిత్రం మరో 7.14 కోట్లు ఖాతాలో వేసింది. మొత్తంగా మూడు రోజుల్లో 25.98 నికరంగా రాబట్టింది. దాంతో అల్లు అర్జున్ స్టామినా బాక్సాఫీస్ తెలియజేస్తున్నది. ఇక సీడెడ్‌లో 2.58 కోట్లు, ఇక కృష్ణా జిల్లాలో మూడో రోజున 80.32 కోట్లు సాధించింది. ఉత్తరాంధ్రలో ఈ చిత్రం 1.35 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తూర్పు గోదావరి జిల్లాలో 85 లక్షల రూపాయలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 60 లక్షలు, గుంటూరులో 64 లక్షలు, నెల్లూరులో 42 లక్షలు రాబట్టింది. దాంతో మూడో రోజున 14.38 కోట్లు వసూలు చేసింది.