పవన్ కోసం పవర్ ఫుల్ ఇంట్రో ప్లాన్ చేసిన OG డైరెక్టర్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – సాహో ఫేమ్ సుజిత్ కలయికలో ‘OG’ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ తాలూకా ఓ క్రేజీ అప్డేట్ అభిమానుల్లో ఆసక్తి నింపుతుంది. ఈ సినిమా కోసం సుజీత్ పవర్ ఫుల్ ఇంట్రో ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటివరకు పవన్ సినిమాల్లో అలాంటి ఇంట్రో లేదట. ఇప్పటికే దానిపై కసరత్తులు కూడా స్టార్ట్ చేశాడట.
ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఖైదీ ఫేమ్ అర్జున్ దాస్ కీలకపాత్ర పోషిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాకు ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. ఆర్‌ఆర్‌ఆర్ వంటి ఇండస్ట్రీ హిట్‌ను నిర్మించిన దానయ్య ఈ సినిమాకు ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నాడు.