సివిల్, క్రిమినల్ కేసుల్లో స్టే ఆర్డర్ స్వయంచాలకంగా ముగియదు: సుప్రీంకోర్టు

supreme-cour

న్యూఢిల్లీ: సివిల్, క్రిమినల్ కేసుల్లో దిగువ కోర్టు లేదా హైకోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్‌ ఉత్తర్వులు ఆరు నెలల తర్వాత ఆటోమేటిక్‌గా రద్దు కావని సుప్రీంకోర్టు తెలిపింది. ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ మేరకు స్పష్టం చేసింది. దిగువ కోర్టుల స్టే ఆర్డర్‌లను ప్రత్యేకంగా పొడిగించకపోతే అవి రద్దు అవుతాయన్న 2018 నాటి సుప్రీంకోర్టు తీర్పుతో తాము ఏకీభవించడం లేదని రాజ్యాంగ ధర్మాసనం తెలిపింది.

కాగా, కేసుల పరిష్కారానికి కాలక్రమాన్ని నిర్ణయించడం రాజ్యాంగ ధర్మాసనం, సుప్రీంకోర్టు, హైకోర్టులు మానుకోవాలని రాజ్యాంగ ధర్మాసనం సూచించింది. కేవలం అసాధారణ పరిస్థితులలో మాత్రమే అలా చేయవచ్చని పేర్కొంది. ఈ మేరకు వేర్వేరుగా రెండు ఏకకాల తీర్పులను గురువారం ప్రకటించింది. సివిల్, క్రిమినల్ కేసుల్లో స్టే ఆర్డర్ ఆటోమేటిక్‌గా రద్దు కాదని న్యాయమూర్తి ఏఎస్‌ ఒకా తెలిపారు. అలాగే మార్గదర్శకాలకు సంబంధించి విడిగా, ఏకకాలిక తీర్పును న్యాయమూర్తి పంకజ్ మిథాల్ వెల్లడించారు.