వేదిక ఫై లిప్ లాక్ ఇచ్చి షాక్ ఇచ్చిన శ్రీయ..సిగ్గుతో తలదించుకున్న యాంకర్ ప్రదీప్

సినీ నటి శ్రీయ ఎప్పుడు ఏదోక విధంగా వార్తల్లో నిలువడం ఆమె ప్రత్యేకం. తాజాగా జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ వేడుకలో శ్రియ తన భర్త ఆండ్రూతో కలిసి హాజరైంది. అలా రావడమే కాదు.. వేదిక ఫై భర్తకు లిప్ లాక్ ఇచ్చి అందరికి షాక్ ఇచ్చింది.
జీ అవార్డు వేడుకకు ఈ జంట రావడంతో గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పారు. ఈ క్రమంలో శ్రియ భార్త ఆండ్రూ అందరిని ఆశ్చర్య పరిచాడు. ఇంగ్లీష్ తప్ప మరే భాష తెలియని ఆండ్రూ.. తెలుగులో అందరికీ నమస్కారం అంటూ పలికరించారు. దీంతో అందరూ షాక్ అయ్యారు. సోషల్ మీడియాలో ఎలా పోజులు పెడతారు అని యాంకర్ ప్రదీప్ అడగడం తో.. కొన్ని రొమాంటిక్ స్టిల్స్ పెట్టారు. ఈ క్రమంలో శ్రియ బుగ్గ మీద ఆండ్రూ ముద్దు పెట్టేశాడు. తానేమీ తక్కువ తిన్నానా? అన్నట్లు శ్రియ ఏకంగా ఆండ్రో కు లిప్ లాక్ ఇచ్చి అందర్నీ షాక్ లో పడేసింది. ఈ ఘటన తో యాంకర్ ప్రదీప్ సిగ్గుతో తలదించుకున్నాడు.
ఇష్టం మూవీ తో 2001 లో తెలుగు ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన శ్రీయ..అగ్ర హీరోలతో పాటు యంగ్ హీరోల సరసన కూడా జోడి కట్టి ప్రేక్షకులను అలరించింది. ఇండస్ట్రీ లో అడుగుపెట్టి దాదాపు రెండు దశాబ్దాలు కావొస్తున్నా ఇంకా సినిమా ఛాన్సులు దక్కించుకుంటూనే ఉంది. కేవలం సినిమాలతోనే కాదు సోషల్ మీడియా లోను ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. ప్రస్తుతం శ్రియ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం రణం రుధిరం)లో అజయ్ దేవగణ్‌కు జోడీగా నటిస్తుంది. అలాగే ‘గమనం’ అనే మల్టీలాంగ్వేజ్ చిత్రంలో నటిస్తుంది.
https://youtube.com/watch?v=ufHp0Adh2i8