జమ్ము, వారణాసిలో శ్రీవారి ఆలయాలు

Lord Tirumala Venkateswara Swamy

Tirumala: జమ్ము, వారణాసిలో శ్రీవారి ఆలయాలను నిర్మించేందుకు టీటీడీ పాలకమండలి నిర్ణయించిందని టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ పేర్కొన్నారు. ఈరోజిక్కడ ఆయన మాట్లాడుతూ జమ్ము ప్రభుత్వం ఏడు ప్రాంతాలను ప్రతిపాదించిందన్నారు. నాలుగు ప్రాంతాలు అనుకూలంగా ఉన్నట్లు గుర్తిం చామన్నారు. ఈ ఏడాదిలోనే జమ్ములో శ్రీవారి ఆలయ నిర్మాణం ప్రారంభిస్తామన్నారు. జనవరిలో స్వామివారిని 22.9 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారన్నారు. 1.01 కోట్ల లడ్డు ప్రసాదం విక్రయించామన్నారు. జనవరిలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.94.9 కోట్లు సమకూరినట్లు పేర్కొన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/