శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం

ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 885- ప్రస్తుత నీటిమట్టం 863.7 అడుగులు

Srisailam reservoir-Heavy flood flow
Srisailam reservoir-Heavy flood flow

శ్రీశైలం ప్రాజెక్టుకు వరద భారీగా పెరిగింది. ప్రస్తుతం జలాశయానికి 4,05,416 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులకు గాను..ప్రస్తుతం నీటిమట్టం 863.7 అడుగులు ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8 టీఎంసీలు. ప్రస్తుతం వంద టీసీఎంలకు పైగా నీరు నిల్వ ఉంది. ప్రస్తుతం ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రం లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. ఎగువ ఉన్న అన్ని ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండుకోవడంతో అధికారులు వచ్చిన వరదను వచ్చినట్టే దిగువకు వదులుతున్నారు. వరద ఇదే స్థాయిలో కొనసాగితే కొద్ది రోజుల్లోనే ప్రాజెక్టు నిండే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.

‘నిఘా’ వార్తల కోసం : https://www.vaartha.com/specials/investigation/