విప్రో నూతన సీఈవోగా శ్రీనివాస్ పల్లియా

Srinivas Pallia is the new CEO of Wipro

న్యూఢిల్లీ: ఇండియా ఐటీ దిగ్గజ కంపెనీ విప్రోకు నూతన సీఈవోగా శ్రీనివాస్ పల్లియా నియమితులయ్యారు. థియరీ డెలాపోర్టే రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో శ్రీనివాస్‌ను సీఈవోగా నియమించినట్టు విప్రో వెల్లడించింది. ఈ మేరకు స్టాక్ ఎక్స్ఛేంజీకి అధికారిక సమాచారం ఇచ్చింది. శ్రీనివాస్ పల్లియా ఎవరు, ఆయన ఇంతకుముందు ఏ హోదాల్లో పనిచేశారో అనే విషయాల గురించి తెలుసుకుందాం.

. శ్రీనివాస్ పల్లియా 1992లో విప్రోలో ప్రొడక్ట్ మేనేజర్‌గా కెరీర్ ప్రారంభించారు. 32 సంవత్సరాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. మార్కెటింగ్ & బ్రాండ్ మేనేజర్, US సెంట్రల్ ఆపరేషన్స్ జనరల్ మేనేజర్, USAలో ఎంటర్‌ప్రైజ్ బిజినెస్ వైస్ ప్రెసిడెంట్‌, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ & బిజినెస్ అప్లికేషన్ సర్వీసెస్ గ్లోబల్ హెడ్‌, RCTG బిజినెస్ యూనిట్‌ చీఫ్ ఎగ్జిక్యూటివ్, కన్స్యూమర్ బిజినెస్ యూనిట్ ప్రెసిడెంట్, USA రీజియన్ సీఈవోగా పనిచేశారు. ఇప్పుడు సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ అయ్యారు.

. శ్రీనివాస్ పల్లియా విప్రో ఎగ్జిక్యూటివ్ బోర్డ్, ఇన్‌క్లూజన్ అండ్ డైవర్సిటీ కౌన్సిల్‌లో సభ్యుడిగా కూడా కొనసాగుతున్నారు.

. బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) నుంచి మాస్టర్ ఆఫ్ టెక్నాలజీలో డిగ్రీ చేశారు. హార్వర్డ్ బిజినెస్ స్కూల్ లీడింగ్ గ్లోబల్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్, మెక్‌గిల్ ఎగ్జిక్యూటివ్ ఇన్‌స్టిట్యూట్‌లో అడ్వాన్స్‌డ్ లీడర్‌షిప్ ప్రోగ్రామ్‌లో పట్టభద్రుడయ్యారు.

. తన ఉద్యోగ జీవితంలో ఆయన పలు పురస్కారాలు సాధించారు. 2004లో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్, ఛైర్మన్ క్లబ్ అవార్డులను అందుకున్నారు. 2006లో ఆల్ స్టార్ టీమ్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్‌ సాధించారు. విప్రో కంపిటెన్సీ రేటింగ్, ఎనలిస్టుల పనితీరును మెరుగుపరిచేలా పనిచేసినందుకు 2010లోనూ అవార్డు సొంతం చేసుకున్నారు.

. 2008లో బిజినెస్ టుడే ఎంపిక చేసిన ఇండియాలోని 25 మంది హాటెస్ట్ యంగ్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్‌లలో శ్రీనివాస్ పల్లియా ఒకరు.