బిగ్ బాస్ హౌస్ లో శ్రీరామ్ – హమీద ఫుల్ రొమాన్స్ లో మునిగిపోయారు

బిగ్ బాస్ హౌస్ లో శ్రీరామ్ - హమీద ఫుల్ రొమాన్స్ లో మునిగిపోయారు

బిగ్ బాస్ 5 ప్రేక్షకులను బాగానే అలరిస్తుంది. సభ్యుల మ‌ధ్య గొడ‌వ‌లు, అరుపులు, కోపాలు, న‌వ్వులు, ల‌వ్ ట్రాక్‌ల‌తో రసవత్తరంగా సాగుతుంది. 12వ రోజు మ‌రికాస్త ఎంటర్‌టైన్‌మెంట్‌ మేళవించారు బిగ్ బాస్‌. ఎవ్వ‌రూ ఊహించిన విధంగా శ్రీరామ్‌, హమీద మధ్య రొమాన్స్ పెట్టి యూత్ ను కట్టిపడేసారు.

బిగ్ బాస్ ఐదో సీజన్‌లో అందరి దృష్టిని ఆకర్షించిన మేల్ కంటెస్టెంట్లలో సింగర్ శ్రీరామ చంద్ర ఒకడు. హ్యాండ్సమ్ లుక్స్‌తో ఆకట్టుకుంటోన్న ఈ కుర్రాడు.. బోల్డ్ బ్యూటీ హమీదాతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడు. ఈ క్రమంలోనే ఆమెతోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. అలాగే, తరచూ రొమాంటిక్‌గా చూస్తూ మాట్లాడుతున్నాడు. అతడికి అనుగుణంగానే హమీదా కూడా ప్రతిస్పందిస్తోంది. ఇక, ఇటీవలే వీళ్లిద్దరూ కలిసి మసాజ్‌లు చేసుకున్నారు. ఇక గత రాత్రి ఎపిసోడ్ లో వారిద్ద‌రూ క‌లిసి ఓ క్యూట్ లవ్‌ సాంగ్‌కి రొమాంటిక్‌ స్టెప్పులేసి.. దీంతో మ‌రింత ఇన్ ట్రెస్టింగ్ గా మారింది.

ఇక ప్రస్తుత వారంలో జరిగిన టాస్క్‌లను పరిశీలనలోకి తీసుకొని ఎవరు ఉత్తమ కంటెస్టెంట్, చెత్త కంటెంట్ ఎవరో ఎన్నుకోవాలని బిగ్‌బాస్‌ సూచించాడుు. దాంతో ఎవరికి తోచిన పేర్లను వాళ్లు చెప్పారు. చివరికి వచ్చిన ఓట్లను పరిగణనలోకి తీసుకొన్న తర్వాత నటరాజ్ మాస్టర్ బెస్ట్ ఫెర్ఫార్మర్‌గా, వీజే సన్నీ వరస్ట్ ఫెర్ఫార్మర్‌గా నిలిచాడు. దీంతో వీజే సన్నీకి బిగ్‌బాస్ కఠిన కారాగార శిక్షను విధించాడు. సరిగా ఆటను ఆడలేదని చెప్పిన కారణంగా సన్నీని జైలులో పెట్టాలని ఆదేశించాడు. దాంతో వీజే సన్నీని జైలులో పెట్టి తాళం వేశారు. ఇక ఇంటిలో బీబీ న్యూస్ కోసం యాంకర్లుగా మారిన రవి, కాజల్ ఇంటి సభ్యులను ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా ఫుల్ ఫన్ క్రియేట్ అయింది. మొత్తం మీద శుక్రవారం ఎపిసోడ్ సరదా సరదాగా..రొమాంటిక్ గా సాగింది.