ఆదాయశాఖ ను మోసం చేసిన సోనూసూద్

రియల్ హీరో సోనూ సూద్ కు చెందిన ఇళ్లల్లో , ఆఫీస్ లలో గత మూడు రోజులుగా ఆదాయశాఖ తనికీలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ తనిఖీల్లో సోనూసూద్ దాదాపు రూ. 20 కోట్ల వరకు పన్ను కట్టలేదని ఆదాయశాఖ అధికారులు వెల్లడించారు. సోనూ సూద్‌కు చెందిన నాన్ ప్రాఫిట్ సంస్థ ఫారిన్ కాంట్రిబ్యూషన్ చట్టాన్ని ఉల్లంఘించి సుమారు 2.1 కోట్లు సమీకరించినట్లు ఐటీశాఖ తెలిపింది. సోనుకు సంబంధించిన ఇండ్లు, అతని అసోసియేట్స్ ఇండ్లు, ఆఫీసుల్లో నిర్వహించిన తనికీలు పన్ను ఎగవేతకు చెందిన అనేక పత్రాలు దొరికినట్లు ఐటీశాఖ బయటపెట్టింది. సోనూ సూద్ చారిటీ ఫౌండేషన్ సంస్థను గత ఏడాది జూలైలో ప్రారంభించారు. అయితే ఈ ఏడాది ఏప్రిల్ వరకు ఆ సంస్థ 20 కోట్లు విరాళాల రూపంలో సేకరించినట్లు తెలుస్తోంది. దీంట్లో ఇప్పటి వరకు 1.9 కోట్లను ఖర్చు చేశారు. మరో 17 కోట్లు ఆ సంస్థ బ్యాంక్ అకౌంట్లోనే ఉన్నట్లు ఐటీశాఖ తెలిపింది.
ఇక కరోనా వైరస్ మహమ్మారి ప్రబలిన సమయంలో దేశం మొత్తం లాక్ డౌన్లో ఉండగా ఎందరో వలస కార్మికులను తమ తమ సొంత గ్రామాలకు చేర్చాడు సోనూ సూద్. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ రాష్ట్రానికి చెందిన వలస కూలీలను తమ రాష్ట్రాలకు తీసుకుని వెళ్లడానికి సందేహించిన వేళ.. కొన్ని వందల బస్సులను ఏర్పాటు చేసి కూలీలను తమ ఇళ్లకు చేర్చాడు. దీంతో దేశం మొత్తం అతడిని హీరోగా కొనియాడడం జరిగింది.