మార్చిలో బ్యాంకులకు ఆరురోజులు సెలవులు!

Bank
Bank

న్యూఢిల్లీ: మార్చి 10 వ తేదీ నుంచి 15వ తేదీ వరకు వరుసగా సెలవులు వచ్చాయి. ఇలా ఒకేసారి బ్యాంకు కార్యకలాపాలు నిలిచిపోవడంతో ఖాతాదారులు అసౌకర్యానికి గురి కావాల్సిందే. దీంతో ముందు జాగ్రత్తగా ఇప్పుడే ప్లాన్ చేసుకుంటే మంచిదని పలువురు అభిప్రాయపడుతున్నారు. వేతనాలు పెంపును కోరుతూ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా,ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సంయుక్తంగా బంద్‌కు పిలుపునిచ్చాయి.మార్చి 11 నుంచి 13 వరకు మూడు రోజులపాటు దేశవ్యాప్తంగా ఈ సమ్మె నిర్వహించనున్నారు.మార్చి 10 వ తేదీన హోలీ కావడంతో ఆ రోజు కూడా బ్యాంకులకు సెలవు ఉంటుంది. ఇక మార్చి 14 రెండవ శనివారం, మార్చి 15 ఆదివారం కారణంగా వరుసగా ఆరు రోజులు బ్యాంకు మూతపడనున్నాయి.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/