నిర్భయ దోషులకు తీహార్ జైలు అధికారులు లేఖ
కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు అనుమతిస్తామంటూ లేఖ

న్యూఢిల్లీ: నిర్భయ దోషులకు మార్చి 3న ఉదయం 6గంటలకు ఉరిశిక్షను అమలు చేసిన విషయం తెలిసిందే. ఈనేపథ్యలో నిర్భయ దోషులకు తీహార్ జైలు అధికారులు చివరి లేఖను రాశారు. కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు అనుమతిస్తామంటూ లేఖలో అధికారులు పేర్కొన్నారు. అయితే, దోషుల్లో ఇద్దరైన అక్షయ్, వినయ్ మాత్రమే తమ కుటుంబ సభ్యులను కలుస్తామని అధికారులకు చెప్పారట. ముఖేశ్, పవన్ మాత్రం ఫిబ్రవరి 1వ తేదీకి ముందే తాము కుటుంబ సభ్యులను కలిశామని జైలు అధికారులకు తెలిపారు. మరోవైపు, వినయ్ తన తలను జైల్లోని గోడకు కొట్టుకోవడంతో, జైలు అధికారులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/