108 అడుగుల హనుమాన్ విగ్రహాన్నిఆవిష్కరించిన ప్రధాని మోడీ

దేశవ్యాప్తంగా నాలుగు విగ్రహాల్లో ఇది రెండోది

YouTube video

న్యూఢిల్లీ: నేడు హనుమాన్ జయంతి సందర్భంగా గుజరాత్ లోని మోర్బి జిల్లాలో ఏర్పాటు చేసిన 108 అడుగుల ఎత్తయిన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రధాని నరేంద్రమోడీ శనివారం ఆవిష్కరించారు. వీడియో కాన్ఫరెన్స్ రూపంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనడాన్ని గౌరవంగా భావిస్తున్నట్టు అంతకుముందు ప్రధాని చెప్పారు.

‘‘నేడు హనుమాన్ జయంతి పర్వదినాన్ని జరుపుకుంటున్నాం. మోర్బిలో ఉదయం 11 గంటలకు 108 అడుగుల హనుమాన్ విగ్రహావిష్కరణ జరుగుతోంది. ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు లభించడాన్ని గౌరవంగా భావిస్తున్నాను’’ అంటూ ప్రధాని ట్వీట్ చేశారు. హనుమాన్ జీ చార్ ధామ్ ప్రాజెక్టు కింద దేశవ్యాప్తంగా నాలుగు ఎత్తయిన హనుమాన్ విగ్రహాలను ఏర్పాటు చేస్తుండగా.. అందులో ఇది రెండోది. మరోవైపు నేడు దేశవ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతుండడం గమనార్హం.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/