ఐసీయూలో సిరివెన్నెల సీతారామశాస్త్రి ..

ఐసీయూలో సిరివెన్నెల సీతారామశాస్త్రి ..

సీనియర్ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి తీవ్ర అస్వస్థత గురయ్యారు. దీంతో ఆయన్ను హైదరాబాద్ లోని కిమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేసారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. కిమ్స్‌లో జాయిన్ అయ్యి రెండు రోజులు అవుతుందట. ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి ఎలా ఉందనేది ఎవ‌రూ చెప్ప‌డం లేదు. ఆయ‌న కుటుంబ స‌భ్యులు, స‌న్నిహితులు కూడా ఈ విష‌యంపై ఇంత వ‌ర‌కు స్పందించ‌లేదు.

1986లో విడుద‌లైన ‘సిరివెన్నెల‌’ చిత్రంతో గేయ ర‌చ‌యిత గా సినీ ప్ర‌స్థానాన్ని ప్రారంభించారు సీతారామ‌శాస్త్రి. మొదటి సినిమాతోనే ఆయ‌న‌కు చాలా మంచి పేరు వ‌చ్చింది. అప్ప‌టి నుంచి ఆయ‌న పాటల ర‌చ‌యితగా రాణిస్తూ వస్తున్నారు. మూడున్న‌ర దశాబ్దాలుగా ఆయ‌న ఎన్నో వేల పాట‌ల‌ను రాశారు. ఎన్నో అవార్డ్స్ అందుకున్నారు. పాట ఎలాంటిదైనా అందులో తెలియ‌ని ఓ స్ఫూర్తిని నింపి రాయ‌డం ఆయనకు మాత్రమే చెల్లింది. అందుకనే తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌కు ఆయ‌నెంతో ప్రీతిపాత్రుడ‌య్యారు.