బిగ్ బాస్ 5 షాక్ : యాంకర్ రవి అవుట్..సన్నీ ఇలా చేసాడేంటి..?

బిగ్ బాస్ 5 షాక్ : యాంకర్ రవి అవుట్..సన్నీ ఇలా చేసాడేంటి..?

తెలుగు బిగ్ బాస్ 5 ఫైనల్ స్టేజ్ కి వచ్చేసింది. దీంతో ఫైనల్ కు ఎవరు వెళ్తారు..టాప్ 5 లో ఎవరు ఉంటారు..ఈ వారం ఎవరు హౌస్ ను వదిలి వెళ్తారనేది అందరిలో ఆసక్తిగా మారింది. ఇక ఈ 12 వ వారానికి గాను హౌస్ నుండి యాంకర్ రవి బయటకు వెళ్తున్నట్లు తెలుస్తుంది.

ఈ 12వ వారం మానస్‌ మినహా మిగతా ఏడుగురు ఇంటిసభ్యులు నామినేషన్స్‌లో ఉన్నారు. భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ కారణంగా షణ్ను, సన్నీ, శ్రీరామ్‌, రవి ఈజీగా ఎలిమినేషన్‌ గండం నుంచి గట్టెక్కుతారని అంతా ఊహించారు. మిగిలిన కాజల్‌, ప్రియాంక, సిరిలలో ఒకరు ఎలిమినేట్‌ కాక తప్పదని అంచనా వేశారు. కానీ అందరి ఊహలను తలకిందులు చేస్తూ రవి ఎలిమినేషన్‌ అయ్యాడని తెలుస్తుంది. రవి ఎలిమినేషన్‌ కావడానికి కారణం సన్నీనే. అదేలా అనుకుంటున్నారా..అయితే ఈ స్టోరీ మీరు చదవాల్సిందే.

బిగ్ బాస్ సీజన్ 5 లో ఇటీవల జరిగిన ఫైర్ ఇంజన్ టాస్క్ లో కంటెస్టెంట్ సన్నీ ‘ఎవిక్షన్ ఫ్రీ పాస్’ గెలుచుకున్నాడు. హౌస్ లోకి వచ్చిన సన్నీ మదర్ కళావతితో ఈ ఎవిక్షన్ ఫ్రీ పాస్ ను పంపించాడు బిగ్ బాస్. సన్నీ ఈ పాస్ ను తన కోసం వాడుకోవచ్చు, లేదా తనకు నచ్చిన ఇతర హౌస్ మేట్స్ కోసం వాడుకోవచ్చు. కాజల్ కు ఎలిమినేషన్ మూమెంట్ లో సన్నీ ఈ ఎవిక్షన్ ఫ్రీ పాస్ వాడాడు అని దాంతో ఆమె సేవ్ అయి ఆమె తరువాత తక్కువ వోట్లు సాధించిన రవి ఎలిమినేట్ అయ్యాడని తెలుస్తుంది.

సన్నీ కి ఆ ఎవిక్షన్ పాస్ రావడానికి కారణం కాజల్. మానస్ ఎంత చెప్పినా.. వినకుండా సన్నీని గెలిపించాలని ఫిక్స్ అయ్యి ఫైర్ ఇంజన్ లో కూర్చోవడంతో ఫైనల్ గా సన్నీకే ఎవిక్షన్ ఫ్రీ పాస్ దక్కింది. అందుకే తనకు అండగా ఉన్న స్నేహితురాలికి సన్నీ అండగా నిలబడడంతో ఇప్పుడు సన్నీ ఆమెకు హెల్ప్ చేసాడని అంటున్నారు. యాంకర్ రవి హౌస్ ను వదిలి వెళ్లడం ఆయన అభిమానులు ఎలా తట్టుకుంటారో చూడాలి.