షన్ను తో అంత చనువు ఉండడం నచ్చలేదంటూ సిరి కి చెప్పిన తల్లి ..షాక్ లో షన్ను

షన్ను తో అంత చనువు ఉండడం నచ్చలేదంటూ సిరి కి చెప్పిన తల్లి ..షాక్ లో షన్ను

బిగ్ బాస్ హౌస్ ప్రస్తుతం ఫ్యామిలీ హౌస్ గా మారింది. 12 వారాలుగా ఇంట్లో వారిని వదిలేసి ఒంటరిగా ఉన్న హౌస్ సభ్యులకు షాక్ ఇచ్చారు బిగ్ బాస్. నిన్నటి ఎపిసోడ్ లో తమ ఫ్యామిలీ సభ్యులను హౌస్ లోకి తీసుకొచ్చారు. కుటుంబ సభ్యులను కలిసే ముందే బిగ్ బాస్ ఏదో ఒక టాస్క్ తో పరీక్ష పెడుతూ ఉంటాడు. రైలుబండి తరహాలో అందరూ ముందుకు సాగుతూ ఉండగా సడన్ గా ఆగిపోవాలి అని చెప్పడంతో.. అప్పుడే కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా ఎంట్రీ ఇస్తూ ఉంటారు. ఇక కాజల్ భర్త తో పాటు తన కూతురు కూడా హౌస్ లోకి సంతోషంగా ఎంట్రీ ఇచ్చారు. కాజల్ ని చూడగానే కూతురు ఒక్కసారిగా కన్నీటి పర్యంతం అయ్యింది. ఇక నేటి ఎపిసోడ్‌లో మానస్‌ తల్లితో పాటు.. సిరి తల్లి కూడా ఇంట్లో వచ్చినట్లు తాజాగా విడుదలైన ప్రోమో ద్వారా తెలిసింది. మమ్మి ఇంట్లోకి రావడంతో ఆనందంతో ఎగిరి గంతులేశాడు మానస్‌. ఆమె కూడా మానస్‌ని ముద్దాడుతూ.. ఎమోషనల్‌ అయింది.

ఆమె తర్వాత సిరి తల్లి ఎంట్రీ ఇచ్చింది. ఆ సమయంలో సిరి ఫ్రీజ్‌లో ఉంది. సిరిని ఫ్రీజ్‌ నుంచి రిలీజ్‌ చేయగానే… వెళ్లి తల్లిని గట్టిగా హగ్‌ చేసుకొని ముద్దుల వర్షం కురిపించింది. కూతురిని బాగా ఆడుతున్నావ్‌ అని ప్రొత్సహిస్తూనే.. షణ్ముఖ్‌ని హగ్‌ చేసుకోవడం నచ్చడంలేదని షాకింగ్‌ కామెంట్‌ చేసింది సిరి తల్లి. షణ్ముఖ్‌ సిరిగా బాగా హెల్ప్‌ చేస్తున్నాడని, అది తనకు నచ్చడం లేదని చెప్పింది. దీంతో షన్ను ఫీజులు ఎగిరిపోయాయి. మరి సిరి వల్ల తల్లి ఇంకేమంటుందో ఈరోజు ఎపిసోడ్ లో చూడాలి.