మిలియన్ డాలర్ స్మైల్..

Singer Suneetha

సింగర్ సునీత తెలుగు వారికి పరిచయం చేయనవసరం లేని పేరు.  1995 లో విడుదలైన ‘గులాబి’ సినిమాలో ‘ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో’ పాట ద్వారా టాలీవుడ్ లో ప్లే బ్యాక్ సింగింగ్ కెరీర్ ను ప్రారంభించిన సునీత గాయని గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా.. యాంకర్ గా.. హోస్ట్ గా తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. 
సునీత ఈతరం మహిళల తరహాలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు.
తాజాగా సునీత తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేశారు. లేత ఆకు పచ్చ రంగు చీర ధరించి కొండల దగ్గర నిలుచుని పోజిచ్చారు.  ఈ ఫోటోకు నెటిజన్లు సూపర్ కామెంట్లు పెట్టారు.  “మిలియన్ డాలర్ స్మైల్”.. “మేడమ్.. అంటే మే.. డం అంతే”.. “బాపు బొమ్మ” అంటూ స్పందించారు.  ఒక సునీత మేడమ్ ప్రొఫెషనల్ విషయానికి వస్తే ఈమధ్యే యాంకర్ ప్రదీప్ హీరోగా నటించిన ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమాలో ‘నీలి నీలి ఆకాశం’ అనే పాటను పాడారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/