గోవింద నామస్మరణతో మార్మోగుతున్న సింహాద్రి గిరులు

సింహాచలంలో కొనసాగుతున్న గిరిప్రదక్షిణ..

simhachalam-giri-pradakshina-continuous

సింహాచలం: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన సింహాచలంలో నిన్న సాయంత్రం ప్రారంభమైన గిరి ప్రదక్షిణ కొనసాగుతోంది. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులతో ఈ ఉదయం సింహాద్రి గిరులు కిక్కిరిసిపోయాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచే కాకుండా తెలంగాణ, ఒడిశా నుంచి కూడా వేలాదిమంది భక్తులు తరలివచ్చారు.

గోవింద నామస్మరణతో గిరి ప్రదక్షిణ మార్గాలు మార్మోగుతున్నాయి. ఈ ఉదయం ఏడు గంటల ప్రాంతంలో పాతగోశాల టీ జంక్షన్ వద్ద రద్దీ మరింత ఎక్కువగా కనిపించింది. వరాహ లక్ష్మీనరసింహస్వామిని స్మరించుకుంటూ భక్తులు ముందుకు సాగుతున్నారు.