అడ‌వుల్లో దొరికిన ఎముక‌లు శ్ర‌ద్ధా వాల్క‌ర్‌వే..తేల్చిన డీఎన్ఏ ప‌రీక్ష‌

Shraddha Walkar murder: DNA test confirms bones found in Mehrauli forest belong to her

న్యూఢిల్లీః ఢిల్లీలో సంచలనం సృష్టించిన కాల్‌ సెంటర్‌ ఉద్యోగి శ్రద్ధా వాల్క‌ర్‌ను ఆమె భాయ్‌ఫ్రెండ్ అమీన్ పూనావాలా అత్యంత దారుణంగా చంపిన విష‌యం తెలిసిందే. ఆమె శ‌రీరాన్ని 35 ముక్క‌లుగా చేసి .. న‌గ‌రంలోని వివిధ ప్రాంతాల్లో ప‌డేశాడు. ఆ కిరాత‌క మ‌ర్డ‌ర్ గురించి ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు ద‌ర్యాప్తును కొన‌సాగిస్తూనే ఉన్నారు. స‌మీప అడ‌వుల్లో శ్ర‌ద్ధా శ‌రీర భాగాల‌ను సేక‌రించిన పోలీసులు వాటిని డీఎన్ఏ ప‌రీక్ష నిమిత్తం పంపారు. అయితే ఢిల్లీ అడ‌వుల్లో దొరికిన ఎముక‌లు శ్ర‌ద్ధా వాల్క‌ర్‌వే అని డాక్ట‌ర్లు తేల్చారు. డీఎన్ఏ ప‌రీక్ష ద్వారా నిర్ధార‌ణ అయిన‌ట్లు తెలుస్తోంది. మెహ‌రౌలీ, గురుగ్రామ్ అడ‌వుల నుంచి ఢిల్లీ పోలీసులు శ్ర‌ద్ధా ఎముక‌ల్ని సేక‌రించారు. అయితే ఆ ఎముక‌ల‌కు జ‌రిపిన ప‌రీక్ష‌లో.. ఆమె తండ్రి డీఎన్ఏతో మ్యాచ్ అయిన‌ట్లు గుర్తించారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/international-news/