చిన్నపిల్లలు కూడా ఇలా ఆడరు

కివీస్‌ ఆటగాళ్లపై షోయబ్‌ అక్తర దారుణమైన కామెంట్స్‌

v
Shoaib Akhtar

కరాచీ: న్యూజిలాండ్‌ క్రికెటర్లపై పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ షోయబ్‌ అక్తర్‌ మండిపడ్డారు. సొంతగడ్డపై టీమిండియాతో జరిగిన ఐదు టీ20 సిరీస్‌లో న్యూజిలాండ్‌ ఓడిపోవడ్పంపై ఆయన తీవ్రంగా విమర్శించారు. తాజాగా షోయబ్‌ అక్తర్‌ తన యూట్యూబ్‌ ఛానెల్ ద్వారా మాట్లాడుతూ… ‘ఒక్కసారి కివీస్ ఆటగాళ్ల ఆటతీరు గమనిస్తే చిన్న పిల్లల ఆటకంటే దారుణంగా ఉంది. పరుగులు తీయడానికి అపసోపాలు పడ్డారు. ఒకే ఓవర్లో మూడు వికెట్లు కోల్పోవడం అంటే.. ఆ జట్టు ఆట ఎంత చెత్తగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కీలక సమయంలో అందరూ చేతులెత్తేశారు. గెలవాల్సిన మ్యాచ్‌లను చేజేతులారా పోగొట్టుకున్నారు. నిజంగా వారి ఆట తీరు చూస్తే నాకు చాలా జాలి వేసింది’ అని అన్నారు. కివీస్‌ జట్టులో అత్యంత అనుభవం ఉన్న బ్యాట్సమెన్‌ రాస్‌ టేలర్‌. తన అనుభవాన్ని ఉపయోగించి టేలర్‌ ఒక్క మ్యాచ్‌లో విజాయన్ని అందించలేకపోయాడు. జట్టులోని ఆటగాళ్లు అన్ని విభాగాల్లో విఫలమయ్యారు. ఏ ఒక్కరు తమ ప్రదర్శనతో ఆకట్టుకోలేదు. మ్యాచుల సమయంలో కివీస్ జట్టును చూసి చాలా కోపం వచ్చింది. వాళ్లు ఏ రకమైన క్రికెట్‌ ఆడారో నాకు అర్థం కాలేదు. ఒక స్టుపిడ్‌ క్రికెట్‌ను ఆడారు. వారి ఆటలో చిన్న పిల్లలు కూడా సింగిల్స్‌ తీయడానికి ప్రయత్నిస్తారు అని ఆగ్రహం వ్యక్తం చేసారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/