మంచు విష్ణు ప్యానల్ మోసాలకు పాల్పడుతుందంటూ ప్రకాష్ రాజ్ ఆవేదన

అక్టోబర్ 10 న మా ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో విష్ణు , ప్రకాష్ రాజు లు అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి రాజకీయ ఎన్నికలను తలపిస్తున్నాయి. కరోనా నేపథ్యంలో ‘మా’ లో మొదటిసారిగా పోస్టల్ బ్యాలెట్ పద్దతి చేపట్టబోతున్నారు. దీనికి సంబదించిన పోస్టల్ బ్యాలెట్ ఎన్నికల నిబంధనలను ప్రకటించారు.

సీనియ‌ర్ సిటిజ‌న్స్ వేయాల్సిన పోస్ట‌ల్ బ్యాలెట్ ఓట్ల‌లో మంచు విష్ణు ప్యానెల్ మోసాల‌కు పాల్ప‌డిదంటూ ప్ర‌కాశ్‌రాజ్ ఆరోపించారు. మా ఎన్నికల్లో 60ఏళ్లు పైబడినవారే పోస్టల్ బ్యాలెట్‌కు అర్హులు అని, వైజాగ్, చెన్నైల్లో ఉండేవారి పేర్లు చేర్చి డబ్బులు కట్టారని ఆరోపించారు. మోహన్ బాబు కంపెనీలో మేనేజర్ 56మందికి సంబంధించి రూ. 28వేలు మోహన్ బాబు ఎలా కడుతారని ప్రశ్నించారు. ఎన్నికలు జరుగుతున్న తీరుపై ప్రకాష్ రాజ్ ఆవేదన వ్యక్తం చేశారు.