వై.ఎస్ షర్మిల అమెరికాకు వెళ్లబోతుందా..?

ys sharmila praja prasthanam padayatra begins today

తెలంగాణ రాష్ట్రంలో రాజన్న రాజ్యం తీసుకురావడమే లక్ష్యమని వైఎస్సార్ టిపీ పెడుతూ సొంత పార్టీ పెట్టిన వైస్.షర్మిల..ప్రస్తుతం రాష్ట్రంలో పాదయాత్ర చేస్తూ ప్రజల కష్టాలను తెలుసుకుంటూ కేసీఆర్ సర్కార్ ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. చేవెళ్ల నుంచి యాత్రను ప్రారంభించిన షర్మిల…ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కు చేరుకున్నారు.ఇప్పటివరకు షర్మిల 791 కిలోమీటర్ల దూరం నడిచారు. కాగా ఇప్పుడు ఈమె పాదయాత్ర కు బ్రేక్ ఇచ్చి అమెరికా కు వెళ్లనున్నట్లు తెలుస్తుంది. ఈ నెల వరకు పాదయాత్ర చేసి…వచ్చే నెల మొత్తం అమెరికా లో ఉండేందుకు ఆమె ప్లాన్ చేసుకుంటుందట. ఆమె వ్యక్తిగత పనుల కోసం అమెరికాకు వెళ్లనున్నారని వైఎస్సార్ టిపీ వర్గాలు చెబుతున్నాయి.తిరిగి వచ్చిన తర్వాత పాదయాత్ర కొనసాగింపుపై నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు.

గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా తన ప్రజాప్రస్థాన యాత్రకు బ్రేక్ పడింది. ఆ తర్వాత కరోనా కారణం గా చాలా రోజులు ఇంటికే పరిమితమైంది. కాగా ఇప్పుడు మరోసారి యాత్రకు బ్రేక్ ఇస్తుంది. ఇక షర్మిల పాదయాత్ర అనుకున్నంతగా పార్టీకి ఊపు తీసుకురాలేక పోతుంది. ఎక్కడా ఈ పార్టీకి క్యాడర్ లేకపోవడంతో ఒకే కార్యకర్తలు వెంట నడవాల్సి వస్తుంది. మరోపక్క మీడియా కూడా పెద్దగా కవర్ చేయకపోవడం తో షర్మిల పాదయాత్ర గురించి కానీ , పార్టీ గురించి కానీ ఎవరికీ పెద్దగా తెలియడం లేదు.