నెటిజన్స్ ఫైర్ : బిగ్ బాస్ హౌస్ లో షన్ను అవసరమా..? ఏంట్రా ఇది..?

బిగ్ బాస్ 5 సీజన్ లో ఫేమస్ వారు ఉన్నారని చాలామంది సంతోష పడ్డారు. ముఖ్యంగా షణ్ముఖ్. యూట్యూబ్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉండడం తో హౌస్ లో షణ్ముఖ్ ఉంటె రచ్చ రచ్చే అని ..ఫుల్ గా ఎంటర్టైన్ చేస్తాడని అంత అనుకున్నారు. కానీ హౌస్ లోకి వెళ్లిన తర్వాత షణ్ముఖ్ అసలు రంగు బయటపడింది. అసలు వీడ్ని ఎందుకు తీసుకున్నారా బాబో అని తిట్టుకుంటున్నారు. సీజన్ మొదలైనప్పటి నుండి ఇలాగే కామెంట్స్ వేస్తున్నారు.

ముఖ్యముగా సిరితో షన్ను ఉంటున్న విధానం..ప్రతిదానికి ఆమెపై అరవడం..ఆమె మిగతా సభ్యులతో మాట్లాడుతుంటే తట్టుకోలేకపోవడం..మళ్లీ ఆమెను హగ్ చేసుకోవడం..దానికి కేవలం ఫ్రెండ్ షిప్ హగ్ అని చెప్పడం ఇదంతా కూడా ఎవరికీ నచ్చడం లేదు. ఇకనైనా మారతాడేమో అని ప్రేక్షకులు , అభిమానులు , నెటిజన్లు అనుకుంటూవస్తున్నారు తప్ప అతడు మాత్రం మారడం లేదు. సీజన్ పూర్తి అవ్వడానికి వచ్చిన ఇంకా షన్ను ఎవరితో కలవడం లేదు. మరోపక్క సిరి ని సైతం తన ఆటను ఆడకుండా ఆడ్డుపడుతున్నాడు. వాస్తవానికి షన్ను కన్నా సిరి అట చాల బాగుంది. టాస్క్ లలో కానీ హౌస్ సభ్యులతో ఉండే విధానం కానీ అంత బాగుంది. కేవలం షన్ను వల్లే ఆమె టాప్ 3 లో లేకుండా అయ్యింది. ఇక బుధువారం జరిగిన ఎపిసోడ్ లో అయితే షన్ను చేసిన అతి బిగ్ బాస్ షో పైనే నెగిటివ్ వచ్చేలా చేసాడు. ఛీ వీడు ఏంట్రా..కామెడీ ని కూడా సీరియస్ తీసుకుంటున్నాడు.. అసలు వీడిని ఎందుకు తీసుకున్నారా అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తం మీద బిగ్ బాస్ షో వల్ల షణ్ముఖ్ నిజస్వరూపం ఏంటిది అనేది బయటపడింది.