జియో ఫైబర్‌లో సౌదీ భారీ పెట్టుబడులు

వేగవంతంగా చర్చలు

Jio Fiber
Jio Fiber

ముంబై: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన జియో ప్లాట్‌ఫామ్స్‌లోకి ఇటీవలి వరకు పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చిన విషయం విదితమే.

తాజాగా జియో ఫైబర్‌లో పెద్ద మొత్తం ఇన్వెస్‌ట చేసేందుకు సౌదీ అరేబియాకు చెందిన పబ్లిక్‌ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ (పిఐఎఫ్‌) ఆసక్తి కనబరుస్తోంది. ఈ మేరకు రిలయన్స్‌, పిఐఎఫ్‌ మధ్య చర్చలు సాగుతున్నాయని తెలుస్తోంది.

ఒక బిలియన్‌ డాలర్ల ఇన్వెస్ట్‌ చేసేందుకు ఆసక్తిగా ఉంది. జియో ప్లాట్‌ఫామ్స్‌లో ప్రపంచ దిగ్గజ సంస్థలు ఇన్వెస్ట్‌ చేశాయి. జియో పైబర్‌లోను మేజర్‌ వాటాను సౌదీకి చెందిన ఈ పిఐఎఫ్‌ దక్కించుకోనుందని తెలుస్తోంది.

పిఐఎఫ్‌తో పాటు అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్‌ అథారిటీ (ఎడిఐఎ) కూడా రిలయన్స్‌తో మరో డీల్‌ చేసుకోనుంది. ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయి.

300 బిలియన్‌ డాలర్ల విలువైన పోర్ట్‌ఫోలియోను సాధించే లక్ష్యంలో భాగంగా ఈ చర్చలు సాగుతున్నట్లు తెలిపింది.

ఈ ఒప్పందంపై రిలయన్స్‌ స్పందించాల్సి ఉంది. అయితే ఈ చర్చలు ఒప్పందం దిశగా సాగుతాయా లేదా చెప్పలేమంటున్నారు.

ఈ రెండు ఒప్పందాలు ఖరారైతే రిలయన్స్‌, సౌదీ, ఇతర గల్ఫ్‌ దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడతాయని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి

పిఐఎఫ్‌, ఎడిఐఎ ఇప్పటికే జియో ప్లాట్‌ఫాంలో భారీగా పెట్టుబడులు పెట్టాయి. 2.2 బిలియన్‌ డాలర్ల మేర ఇన్వెస్ట్‌ చేశాయి.

మరోవైపు, సౌదీ ఆరామ్‌కో రిలయన్స్‌ రిఫైనిరింగ్‌ అండ్‌ పెట్రో కెమికల్స్‌ బిజినెస్‌లో ఇన్వెస్ట్‌ చేసేందుకు చర్చలు జరుగుతున్నాయి.

మార్కెట్‌ విలువపరంగా సౌదీ ఆరామ్‌కో ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీ. జియో ఫైబర్‌ టు ది హోమ్‌ సేవలు ఇప్పటికే 10 లక్షల మంది వరకు రీచ్‌ అయ్యాయి.

రానున్న అయిదేళ్లలో 1600 నగరాల్లో 500 మిలియన్ల కస్టమర్లు, 50 మిలియన్ల ఇళ్లు, 15 మిలియన్‌ ఎంటర్‌ప్రైజెస్‌కు హైస్పీడ్‌ ఫైబర్‌ లక్ష్యాన్ని పెట్టుకుంది.

జియో 7,00,000రూట్‌ కిలోమీటర్లను నిర్మించింది. దీనిని సుమారు 1,100,000పెంచాలని భావిస్తోంది.

తాజా తెలంగాణ వార్తల కోసం :https://www.vaartha.com/telangana/