పవన్ కళ్యాణ్ కు వెంటనే భద్రత పెంచాలి – సీఎం రమేశ్

పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద గుర్తుతెలియని వ్యక్తులు రిక్కీ నిర్వహిస్తున్నారన్న వార్తల ఫై బిజెపి నేత సీఎం రమేష్ స్పందించారు. పవన్ కు తగినంత భద్రతను కల్పించాలని కోరారు. ఆయన ఇంటి వద్ద కొందరు వ్యక్తులు రెక్కీ నిర్వహించారనే వార్తలు వస్తున్నాయని… అయినప్పటికీ, ఏపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు.

ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించినందుకు ఆయన భద్రతను పట్టించుకోరా? అని ప్రశ్నించారు. వైస్సార్సీపీ కార్యకర్తల మాదిరి పోలీసులు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర హోంశాఖ కార్యదర్శిని కలిసి ఏపీ పోలీసుల తీరుపై ఫిర్యాదు చేస్తామని అన్నారు. పవన్ కు తక్షణమే భద్రతను పెంచాలని డిమాండ్ చేశారు.

పవన్ కళ్యాణ్ ను అనుసరిస్తు అనుమానాస్పద వాహనాలు తిరుగుతున్నాయని పార్టీ నేత నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాదు లో పవన్ ఇంటి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు రెక్కీ నిర్వహిస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. విశాఖ ఘటన తరువాత పవన్ కళ్యాణ్ ఇల్లు, పార్టీ కార్యాలయం దగ్గర సందేహాస్పదంగా ఉన్న వ్యక్తులు కనబడుతున్నారన్నారు. పవన్ ఇంటి నుంచి బయటకు వెళుతున్నప్పుడు, తిరిగి వస్తున్నప్పుడు వాహనాన్ని అనుసరిస్తున్నారని పేర్కొన్నారు. కారులోని వ్యక్తులు పవన్ కళ్యాణ్ వాహనాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారని నాదెండ్ల మనోహర్ తెలిపారు. మనోహర్ చెప్పిన దగ్గరి నుండి దీనిపైనే అంత మాట్లాడుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ కు ఏమైనా జరిగితే ..అభిమానుల ఆగ్రహం ఎలా ఉంటుందో చూస్తారంటూ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.