కష్టాల్లో పడిన టీమిండియా

రెండో రోజు ముగిసేసరికి స్కోరు 90/6

Ind vs NZ second test
Ind vs NZ second test

క్రైస్ట్‌చర్చ్‌: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్‌ కష్టాల్లో పడింది. టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్ మెన్‌ మరోసారి విఫలమయ్యారు. దీంతో రెండో ఇన్నింగ్స్ లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ 90 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు, కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి నిరాశ పరిచారు. రెండో ఇన్సింగ్స్ లో పృధ్వీ షా 14, మయాంగ్ అగర్వాల్‌ 3, పూజారా 24, కోహ్లీ 14, రహానే 9, ఉమేశ్‌ యాదవ్ 1 పరుగులు చేసి ఔటయ్యారు. పంత్ 1, విహారీ 5 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. కివీస్ బౌలర్లలో బౌల్ట్ 3 వికెట్టు పడగొట్టాడు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/