అమరావతి కోసం జలదీక్ష చేస్తున్న రైతులు

ఓట్ల కోసం రాష్ట్రాన్ని కులాలు, ప్రాంతాల వారీగా విభజించారు

andhra pradesh
andhra pradesh

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతే ఉండాలంటూ కోరుతూ వరుసగా 75వ రోజు ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాయపూడిలోని కృష్ణానది రైతులు, అమరావతి పరిరక్షణ యువజన జేఏసీ ఆధ్వర్యంలో సేవ్‌ అమరావతి పేరుతో జలదీక్ష చేపట్టారు. సేవ్‌ అమరావతి ప్లకార్డులు పట్టుకుని కృష్ణానదిలో నడుములోతూ నీళ్లలో దిగి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జేఏసీ నేతలు మాట్లాడుతూ..ప్రాంతాల మధ్య ముఖ్యమంత్రి జగన్‌ చిచ్చు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓట్ల కోసం రాష్ట్రాన్ని కులాలు, మతాలు, ప్రాంతాల వారీగా విభజించారని ఆరోపించారు. రైతుల త్యాగాన్ని గుర్తించి, రాధానిగా కొనసాగించాలని డిమాండ్‌ చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/