వినాయక నిమజ్జనంలో విషాదం..

ఎంతో సంతోషం గణేష్ ఉత్సవం చేశామని అనుకొనేలోపు మృతువు పలు రూపాల్లో వచ్చి ఆ కుటుంబాల్లో విషాదం నింపుతుంటాయి. ముఖ్యంగా వినాయక నిమజ్జనం లో ఎక్కువ ప్రమాదాలు జరుగుతుంటాయి. వినాయక నిమజ్జనం చేసేటైంలో నీటిలో మునిగి ప్రాణాలు పోగొట్టుకుంటారు. తాజాగా వినాయక నిమజ్జనం వీక్షిస్తుండగా స్కార్పియో రూపంలో మృతువు వచ్చిన ఘటన ఝార్ఖండ్​ రామ్​గఢ్ పట్టణంలోని జెండా చౌక్ వద్ద చోటుచేసుకుంది.

నిమజ్జనానికి వెళ్తున్న గణపతి విగ్రహాలను ప్రజలు వీక్షిస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా ఓ స్కార్పియో వారి మీదకు దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో 12 మందికి గాయాలు కాగా.. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. వీరందరినీ దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. స్కార్పియోను గుర్తించిన పోలీసులు.. త్వరలోనే డ్రైవర్​ను అదుపులోకి తీసుకుంటామని చెపుతున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన డ్రైవర్​పై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన తో పోలీసులు అలర్ట్ అయ్యారు. చుట్టుపక్కల భారీ బందోబస్తు ఏర్పటు చేసారు.