బండి సంజయ్‌ పాదయాత్రకు హైకోర్టు అనుమతి

బండి సంజయ్‌ పాదయాత్రకు హైకోర్టు నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నాల్గు విడతల్లో రాష్ట్రంలోని పలు ఏరియాల్లో పాదయాత్ర చేపట్టిన సంజయ్..ఇప్పుడు ఐదో విడుత యాత్రకు సిద్ధమయ్యారు. ఈరోజు నుండి బైంసా లో ఐదో విడత పాదయాత్ర ప్రారంభించాలని అనుకున్నారు. దానికి తగ్గట్లే ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ భైంసా సున్నితమైన ప్రాంతం కాబట్టి యాత్రతో పాటు.. బహిరంగసభకు అనుమతి ఇవ్వడం కుదరదని పోలీసులు స్పష్టం చేస్తూ అడ్డుకున్నారు. దీంతో బిజెపి హైకోర్టు ను ఆశ్రయించింది.

బండి సంజయ్‌ పాదయాత్రకు హైకోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. బైంసా సిటీకి 3 కిలోమీటర్ల దూరంలో సభ నిర్వహిస్తేనే అనుమతించాలన్న కోర్టు… బైంసా సిటీలోకి వెళ్లకుండా పాదయాత్ర కొనసాగించాలని సూచనలు చేసింది. ఇక హై కోర్టు తుదితీర్పు నేపథ్యంలో బీజేపీ సీనియర్ నేతలతో బండి సంజయ్ సమావేశం అయ్యారు. బైంసాలోకి పాదయాత్ర వెల్లట్లేదని కోర్టుకు తెలిపారు బీజేపీ లాయర్లు. కాగా, తెలంగాణ హై కోర్టు అనుమతి ఇవ్వడంతో మరి కొద్దిసేపట్లో కరీంనగర్ నుండి బైంసాకు బయలుదేరుతున్నారు బండి సంజయ్.