సమంత తల్లి కాబోతుందా..? అందుకే ఈ నిర్ణయం తీసుకుందా..?

‘ఏమాయ చేసావే’ అని అంత అనుకునేలా తన నటన , గ్లామర్ తో ప్రేక్షకులను కట్టిపడేసిన సమంత..మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ విజయం సాధించి ..వరుస ఛాన్సులు పట్టేసింది. అగ్ర హీరోలందరి సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ..ఆ తర్వాత అక్కినేని నాగ చైతన్య ను పెళ్లి చేసుకొని అక్కినేని కోడలు అయ్యింది. పెళ్లి తర్వాత గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ విభిన్న కథలతో సక్సెస్ లు అందుకుంటూ వస్తుంది. ప్రస్తుతం తెలుగు లో ‘శాకుంతలం’ మూవీ..తమిళంలో నయనతారతో కలిసి ‘కాత్తు వాక్కుల రెండు కాదల్’ అనే సినిమాలు చేస్తుంది. ఈ చిత్ర షూటింగ్లు సైతం పూర్తి కావొచ్చాయి.

ఇదిలా ఉంటె తాజాగా ఈమె తీసుకున్న నిర్ణయం అభిమానులను , చిత్రసీమ ను షాక్ కు గురి చేస్తుంది. ప్రస్తుతం తాను కొత్త సినిమాలేవీ ఒప్పుకోవడం లేదని, తాను కొన్ని సినిమాల్లో చేయబోతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆమె తెలిపింది. ఈమె మాటలు బట్టి చూస్తే ఈమె త్వరలోనే తల్లి కాబోతుందా..? అందుకే ఈ నిర్ణయం తీసుకుందా..? అని అంత మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. మరి సమంత గ్యాప్ తీసుకోవడానికి కారణం అదేనా..? లేక మరేదైనా ఉందా..? అనేది ఆమెనే చెప్పాలి.