సందీప్ కిషన్ ‘మైఖేల్’ మూవీ ట్రైలర్ విడుదల

యంగ్ హీరో సందీప్ కిషన్ పాన్ ఇండియా చిత్రం ‘మైఖేల్’ నుండి ట్రైలర్ విడుదలైంది. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీ తో హీరోగా ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన సందీప్..మొదటి మూవీ తోనే సూపర్ హిట్ అందుకొని వార్తల్లో నిలిచాడు. ఆ తర్వాత వరుస గా సినిమాలు చేసుకుంటూ వచ్చాడు కానీ పెద్దగా విజయం అందుకోలేకపోయారు. ఇటీవల కాస్త గ్యాప్ తీసుకొని ఇప్పుడు పాన్ ఇండియా మూవీ తో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. ఫిబ్రవరి 03 న ఈ మూవీ రాబోతుంది. రంజిత్ జయకోడి డైరెక్ట్ చేయగా..విజయ్‌ సేతుపతి, గౌతమ్ మేనన్, వరుణ్ సందేశ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఇక ట్రైలర్ విషయానికి వస్తే..గౌతమ్ వాసుదేవ్ మీనన్ వాయిస్‌లో మొదలైన ట్రైలర్.. మైఖేల్ (సందీప్ కిషన్)కు హితబోధ చేస్తున్నట్లుగా ఉంది. ‘వేటాడటం రాని జంతువులే.. వేటాడే నోటికి చిక్కుతాయ్ మైఖేల్’ అని ఇంటెన్స్ వాయిస్‌తో వినిపించిన డైలాగ్‌కు కౌంటర్‌గా ‘వెంటాడే ఆకలిని తీర్చుకోవడానికి వేటాడటం తెలియాల్సిన పనిలేదు మాస్టర్’ అంటూ మైఖేల్ చెప్పిన డైలాగ్ స్టోరీపై క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. ట్రైలర్ మొత్తం హై వోల్టేజ్ యాక్షన్, లవ్ మేకింగ్ సీన్స్‌తో నిండిపోయింది.

వరలక్ష్మీ శరత్ కుమార్, అనసూయ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సందీప్‌కు జోడీగా దివ్యాంశ కౌశిక్‌ నటించింది. యాక్షన్ తో పాటు సందీప్, దివ్యాంశ మధ్య లవ్, ఎమోషనల్ సీన్స్ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. ‘ఇందతా ఒక అమ్మాయి కోసం చేస్తున్నావా? నమ్మలేకపోతున్నా మైఖేల్’ అని గౌతమ్ మేనన్ ప్రశ్నించగా.. ‘అమ్మాయి కోసం కాకపోతే ఎందుకు సర్ మనిషి బతకాలి’ అని సందీప్ ఎమోషనల్ గా చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది. సామ్ సీఎస్ అందించిన మ్యూజిక్ సినిమాకు ప్లస్ అయ్యేలా ఉంది. ఓవరాల్ గా ట్రైలర్ చూస్తే సందీప్ ఖాతాలో హిట్ పడేలా ఉంది.

YouTube video