రేవంత్ కు తొడగొట్టి సవాల్ విసిరిన మల్లారెడ్డి..

మంత్రి మల్లారెడ్డి..బాలయ్య స్టయిల్ లో తొడగొట్టి రేవంత్ కు సవాల్ విసిరారు. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న దగ్గరి నుండి కేసీఆర్ సర్కార్ ఫై , తెరాస నేతలపై విమర్శలు చేస్తున్న రేవంత్ రెడ్డి..టీపీసీసీ చీఫ్ అధ్యక్షుడిగా నియామకం అయ్యిందగ్గరి నుండి తన నోటికి ఇంకాస్త పనిచెపుతున్నాడు. ఇప్పటికే ఎన్నో విమర్శలు చేసిన రేవంత్..తాజాగా మంత్రి మల్లారెడ్డి పైన..ఆయన అల్లుడు పైన ఘాటైన విమర్శలే చేసారు. మల్లారెడ్డి యూనివర్సిటీ, మెడికల్ కాలేజీల కోసం భూములు కబ్జా చేశాడని.. నకిలీ పాస్ పుస్తకాలు సృష్టించి అసైన్డ్ భూములను మింగేశాడని..మల్లారెడ్డి అల్లుడు చెరువుని మింగేశాడని..మల్లారెడ్డి అవినీతిపై గ్రామాల్లో దండోరా వేయిస్తానంటూ రేవంత్ అనడం తో..రేవంత్ వాక్యాలకు మల్లారెడ్డి తొడగొట్టి సవాల్ విసిరారు.

అందరికీ టైం ఇవ్వడం కాదు.. వెళ్లి రాజీనామా చేసి రా.. ఇద్దరం పోటాపోటీ తేల్చుకుందామని మల్లారెడ్డి ..రేవంత్ కు ఛాలెంజ్ విసిరారు. అరేయ్ సాలె రేవంత్ అంటూ రెచ్చిపోయారు. ‘‘రేపు నేను రాజీనామా చేస్తా.. మంత్రి పదవికి, ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తా.. నువ్వు కూడా పీసీసీకి రాజీనామా చెయ్. ఎంపీ పదవికి రాజీనామా చేసి రా. ఇద్దరం పోటీ చేద్దాం. నువ్వు గెలిస్తే నేను రాజకీయాల నుంచే తప్పుకుంటా. బరాబర్ నిలబడదాం. ఓడిపోయినోడు ముక్కు నేలకి రాసి సక్కగా ఇంటికెళ్లిపోదాం’’ అంటూ తొడగొట్టి సవాల్ విసిరారు. మరి మల్లారెడ్డి సవాల్ కు రేవంత్ ఎలా రియాక్షన్ ఇస్తాడో చూడాలి.