విడాకుల సమయంలో సమంత చనిపోతా అనుకుందట..
సమంత..నాగ చైతన్య కు విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఆమె చనిపోతానేమో అని భయపడిందట. ఈ విషయాన్నీ స్వయంగా ఆమెనే తెలిపింది. విడాకుల ప్రకటన అనంతరం దైవ దర్శనాలు చేసిన ఈమె..ఆ తర్వాత మళ్లీ సినిమాలతో సోషల్ మీడియా లలో యాక్టివ్ అయ్యింది. నిత్యం సోషల్ మీడియా లో అనేక రకాల పోస్టులు పెడుతూ ఫాలోయర్స్ ను అలరిస్తూ వస్తుంది. తాజాగా విడాకుల గురించి నోరు విప్పింది.
‘నేను విడాకులు తీసుకున్నప్పుడు కుంగిపోయి చనిపోతానని అనుకున్నాను. నేను చాలా బలహీనమైన వ్యక్తినని నా ఫీలింగ్. కానీ నేను ఎంత బంలగా ఉన్నానో తెలిసి ఇప్పుడు ఆశ్చర్యం వేస్తోంది. నేను ఇంత దృఢంగా ఉంగలనని అనుకోలేదు.’ అని ఓ ఇంగ్లీష్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సామ్ చెప్పుకొచ్చింది.
ఇక సినిమాల విషయానికి వస్తే..శాకుంతలం మూవీ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతకన్నా ముందు పుష్ప తో అలరించబోతుంది. ఈ మూవీ లో ఐటెం సాంగ్ చేస్తుంది. దీని తాలూకా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది.