లవ్ స్టోరీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సమంత

ఎట్టకేలకు సమంత అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. లవ్ స్టోరీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అధికారిక ప్రకటన చేసింది. గత కొద్దీ రోజులుగా సోషల్ మీడియా లో సమంత పేరు వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. నాగ చైతన్య తో విడాకుల ప్రకటన అనంతరం సమంత ను అంత ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. సమంత తీరు వల్లే చైతు విడాకులు ఇచ్చాడని అంత అన్నారు. ఈ తరుణంలో దసరా కానుకగా తన కొత్త ప్రాజెక్ట్ కు సంబదించిన న్యూస్ తెలిపి అభిమానులకు కథ ఊరటనిచ్చింది.
తన తదుపరి చిత్రం డ్రీమ్ వారియర్ పిక్చర్స్‌తో చేయబోతున్నారట. ఇందుకు సంబంధించిన ఆఫిసియల్ అనౌన్స్ మెంట్ వెలువడింది.ఎస్ఆర్ ప్రభు డ్రీమ్ వారియర్ పిక్చర్స్ కోసం సమంత పని చేయనుండగా, ఇంకా పేరు పెట్టని బైలింగ్యువల్ మూవీకి శాంతరూబన్ జ్ఞానశేఖరన్ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రం డిఫరెంట్ లవ్ స్టోరీగా ఉంటుందని, ఈ చిత్రాన్ని ప్రొడక్షన్ నెం.30 అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఇందులో సమంత విచారంగా కనిపిస్తుండగా, ఓ విభిన్నమైన ప్రేమకథ చిత్రంగా ఈ మూవీ రూపొందనుందని తెలుస్తోంది.